మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
హిందీలో కూడా ఈ చిత్రం రూ.650 కోట్లకు చేరువలో ఉంది.
ఈ ఏడాది భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘పుష్ప 2’ ఇంకా బాక్సాఫీస్‌పై ప్రభంజనం సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ మూవీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మేకర్స్ ఈ రూమర్స్‌కి ఎండ్ కార్డ్ పెట్టారు.
‘పుష్ప 2’ ఓటీటీలో 56 రోజులకు ముందుగా వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.
థియేటర్ కలెక్షన్లు తగ్గకుండా, ప్రేక్షకులు పెద్ద తెరపైనే సినిమాను ఆస్వాదించాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు.
నార్త్ ఇండియాలోని మల్టీప్లెక్స్ రూల్స్ ప్రకారం, సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలి. ఆ విధంగానే ఈ చిత్రం నార్త్ మార్కెట్‌లో విడుదలైనట్లు సమాచారం.
ఇక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ.250 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇది స్ట్రీమింగ్‌కు మరింత ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి.
ముఖ్యంగా హిందీలో ‘పుష్ప 2’ బిజినెస్ ఇంకా కొనసాగుతుండటం, థియేటర్ వసూళ్లను ఎక్కువ స్థాయిలో పొందాలన్న ఉద్దేశంతోనే మేకర్స్ ఓటీటీ విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు