హైదరాబాద్: ఈ సంవత్సరం ఆరంభం నుండి ఎక్కువగా వినిపిస్తున్న పేరు కరోనా. మన దేశంలో కరోనా వ్యాప్తి ఫిబ్రవరి నుండి ప్రారంభం అయింది. మర్చి నెల నుండి లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులు, లక్డౌన్ సబ్జక్ట్స్ పైన చాలానే సినిమాలు ప్రకటించారు, అవి షూటింగ్ దశలో కూడా ఉన్నాయి. వీటిలో ఎవ్వరూ టచ్ చెయ్యని రియలిస్టిక్ బోల్డ్ కంటెంట్ తో ఒక సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరు ‘నిర్బంధం’. ఈరోజు 5 నిమిషాల నిడివి గల ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది.
లాక్ డౌన్ సమయంలో జరిగిన కొన్ని రకాల సంఘటనలని రియలిస్టిక్ గా చూపించినట్టు ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
‘దైర్యం చేసుకొని చూడండి,
దైర్యం చెప్పి చూపించండి,
ప్రతి మహిళా చూడాల్సిన చిత్రం’
అనే లైన్స్ తో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ముందు గా చెప్పినట్టు కానే ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ చూస్తే మాత్రం భయం అవుతుంది. నిజంగా ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. ట్రైలర్ అన్ సెన్సార్డ్ కాబట్టి ట్రైలర్ లో ఉన్న సంభాషణలు అన్ని చాలా ‘రా’ గా ఉన్నాయి. పేరుకి బూతు అని అనుకున్న గాని నిజంగా బయట అలాంటి మాటలే వినిపిస్తాయి. అదే చూపించడానికి డైరెక్టర్ ప్రయత్నించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకి కథ, కథనం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం, ఫైట్స్, హీరో, దర్శకత్వం అన్నీ బండి సరోజ్ కుమార్ కావడం గమనించదగ్గ విషయం. ప్రయత్నం కొత్తగానే ఉన్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ దర్శకుడు ఇదివరకే ‘సూర్యాస్తమయం’ అనే ఒక సినిమా తీసాడని తెలుస్తుంది.