ఆస్ట్రేలియా: డిసెంబర్ 26న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభమవుతున్న భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది.
కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్‌లో గాయపడ్డాడు. మోకాలికి దెబ్బ తగిలిన రోహిత్, మొదట నొప్పిని తట్టుకుని ప్రాక్టీస్ చేసినప్పటికీ, చివరికి వైద్యుల సాయానికి నడుం త్రోక తప్పలేదు.
ఫిజియోలు అతడి మోకాలికి పట్టీలు వేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ గాయం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, నాలుగో టెస్ట్‌కు ముందు అతడి ఆడే అవకాశాలను ఫిజియోలు సమీక్షిస్తారని తెలుస్తోంది.
మరోవైపు, కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఇప్పటికే తుదిజట్టులోకి ఎంపిక కావడం అనుమానంగా మారింది. రోహిత్ గాయం కూడా జతకలవడంతో భారత్ జట్టుకు గాయాల సమస్య మున్ముందు పరీక్షగా మారింది.
ఇదే సమయంలో, భారత జట్టు ఆటగాళ్లు నెట్స్‌లో కసరత్తు చేస్తూ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు.