ఏపీ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కుటుంబానికి సంబంధించి రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ కేసులో పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోలీసులు వీరికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలలోగా స్టేషన్‌కు హాజరుకావాలని నోటీసులు పంపారు.
నోటీసులు అందజేయడానికి పేర్ని నాని ఇంటికి వెళ్లిన పోలీసులు, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నోటీసులను తలుపులకు అంటించారు.
పోలీసులు తమ దర్యాప్తులో సహకరించాలని, కేసుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజలను కూడా నిందితులుగా చేర్చారు. మానస తేజను ఏ2 ముద్దాయిగా గుర్తించి, ప్రస్తుతం ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రేషన్ బియ్యం మాయానికి సంబంధించి ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలిపి న్యాయం చేస్తామని పోలీసులు స్పష్టంచేశారు.