మూవీడెస్క్: “ముఫాసా: ది లయన్ కింగ్” (MUFASA : THE LION KING) కథ ప్రధానంగా సింహాల రాజ్యం ఆధారంగా సాగుతుంది.
ముఫాసా చిన్ననాటి నుంచి రాజుగా ఎదిగే ప్రస్థానం ఇందులో చూపించారు.
చిన్నప్పటి అపజయాలను అధిగమించి, ముఫాసా తన మిత్రుల సహకారంతో ఎలా విజయం సాధించాడన్నదే ఈ సినిమా మూల కధాంశం.
స్నేహం, ధైర్యం, ధర్మం వంటి విలువల చుట్టూ కథ మలిచారు.
విశ్లేషణ
ఈ చిత్రాన్ని కథాపరంగా పెద్దగా కొత్తగా అనిపించకపోయినా, విజువల్స్, మ్యూజిక్, వాయిస్ ఓవర్‌లు సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి.
తెలుగులో మహేశ్ బాబు, సత్యదేవ్ వంటి స్టార్ డబ్బింగ్ ఆర్టిస్టులు వాయిస్ అందించడం పెద్ద ప్లస్.
చిన్న పిల్లలతో పాటు పెద్దవారిని కూడా ఆకట్టుకునేలా ఎమోషనల్ టచ్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్, అడ్వెంచర్ సన్నివేశాలు స్క్రీన్‌పై ఆకట్టుకునేలా ఉన్నాయి.
అలాగే బ్రహ్మానందం, అలీ వంటి సీనియర్ కమెడియన్స్ టిమోన్ అండ్ పుంబా పాత్రలకు వాయిస్ ఓవర్ అందించడం మరింత ఎంటర్టైనర్ గా తెలుగు ఆడియేన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.
సినిమాలో అసలైన క్లయిమాక్స్ పెద్దగా హైలెట్ కాలేదు. పెద్దగా అంచనాలు లేకుండా చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా క్లిక్కయ్యే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్
మహేశ్ బాబు, సత్యదేవ్ వంటి స్టార్ వాయిస్ ఓవర్‌లు.
అద్భుతమైన విజువల్స్, సౌండ్ డిజైన్.
ఎమోషనల్ ఎలిమెంట్స్ మంచి బలంగా నిలిచాయి.
చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ ఎంటర్టైన్మెంట్.
మైనస్ పాయింట్స్
కథలో కొత్తతనం లేకపోవడం.
కీలక సన్నివేశాల్లో పెద్దగా మలుపులు లేకపోవడం.
మొత్తం మీద “ముఫాసా: ది లయన్ కింగ్” ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేసే ఒక మంచి అనుభవంగా నిలుస్తుంది.
రేటింగ్: 2.75/5