హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ కేసులో నిందితులుగా పుష్ప-2 చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు.
సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, సెక్యూరిటీ, ఫ్లోర్ ఇంచార్జ్‌లను ఏ-1 నుండి ఏ-10 వరకూ నిందితులుగా చేర్చారు.
అదేవిధంగా, అల్లు అర్జున్ పీఏ, మేనేజర్, బౌన్సర్లు, ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు కూడా నిందితుల జాబితాలో ఉన్నారు.
ఈ కేసు విచారణలో నిందితులుగా గుర్తించబడిన వారు, వారి పాత్రలు మరియు బాధ్యతలు స్పష్టంగా నమోదయ్యాయి.
ఆలాగే, మైత్రీ మూవీస్ నిర్మాతల పేరును కూడా రిమాండ్ రిపోర్టులో చేర్చడం కేసుకు కీలకమైన పరిణామంగా మారింది. ఈ పరిణామాలు ఈ సంఘటనను మరింత రాజకీయ రంగు పొంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చలకు దారితీసింది.