టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయ్యి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే హీరో రామ్ చరణ్ జానీ మాస్టర్‌ను ఫోన్ చేసి మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
జానీ మాస్టర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన వెంటనే చరణ్ తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, పని పై ఫోకస్ చేయమని, ఆరోగ్యంగా ఉండాలని సలహా ఇచ్చారని జానీ తెలిపారు.
అలాగే, చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో సాంగ్స్ కోసం ఆయనను కలవమన్నట్లు చెప్పారు. ఈ మద్దతు తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నారు.
ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమాలోని డోప్ సాంగ్‌కు జానీ కంపోజ్ చేసిన డాన్స్ స్టెప్పులు ట్రెండ్ అవుతుండగా, చరణ్ ఫ్యాన్స్ దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జానీ టాలెంట్‌ను గుర్తించి చరణ్ మద్దతు ఇవ్వడం సూపర్ అని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.