సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, నటి సంజన గల్రానీ తన స్ట్రాంగ్ స్టేట్‌మెంట్‌తో అల్లు అర్జున్‌కు మద్దతు తెలిపారు. తొక్కిసలాట ఘటనకు బన్నీ బాధ్యులు కాదని, ఆయనను కావాలని కేసులో నిందితుడిగా చేర్చారని ఆమె ఆరోపించారు.
ఇలాంటి ఘటనలు కేవలం సినీ ప్రముఖులపై నెట్టడం సరికాదని సంజన అన్నారు. తాను కూడా గతంలో వ్యవస్థకు బలయ్యానని చెప్పిన ఆమె, అల్లు అర్జున్‌ను బయటకు వచ్చి మాట్లాడినందుకు అభినందించారు. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడటం సాహసమని, బన్నీ ఎటువంటి తప్పు చేయలేదని ఆమె తెలిపారు.
తెలుగు సినీ హీరోలకు ప్రత్యేకమైన అభిమాన గణం ఉందని, అది కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుందని సంజన అన్నారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు అసలు కారణాలు గుర్తించాలని, అల్లు అర్జున్‌ను తప్పుగా ఎండగట్టడం అన్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.