మూవీడెస్క్: టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
తనపై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో అరెస్ట్ అయిన ఆయన కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు.
ఇటీవల హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నానని, తన పనితో అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తానని జానీ మాస్టర్ తెలిపారు.
తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు ఎలాంటి తప్పు లేదని వెల్లడించారు.
“న్యాయస్థానంపై నమ్మకం ఉంది, నాకు న్యాయం చేస్తుంది. క్లీన్ చిట్‌తో బయటకు వస్తాను. అప్పటి వరకు నేను నిందితుడిగా ఉంటాను,” అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. “నాకు దేవుడి ఆశీర్వాదం, నా అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
నా పనితో మాత్రమే మీ ముందుంటాను. మీ ప్రేమ నాకు ఎప్పుడూ అవసరం. మీ బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఉన్నాను,” అంటూ వీడియోలో వ్యాఖ్యానించారు.
జానీ మాస్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.
కేసు పూర్తయ్యే వరకు న్యాయపరమైన ప్రక్రియలో అన్ని విధాల సహకరిస్తానని, న్యాయం తన వైపునే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.