మూవీడెస్క్: ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ప్రతిష్టను మలుపు తిప్పింది. రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు, ఆస్కార్ అవార్డు వంటి ఘనతలు అందుకుని చరిత్ర సృష్టించింది.
అయితే, ఇప్పుడు ఆ సినిమా వెనుక కష్టాలపై దృష్టి సారిస్తూ, ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు.
ఈ డాక్యుమెంటరీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
సినిమాలోని బిహైండ్ ద సీన్స్, షూటింగ్ అనుభవాలు, ఫన్నీ మూమెంట్స్, కీలక సీన్స్ వెనుక ఉన్న కష్టం చూపించడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఎన్టీఆర్, చరణ్ కీలక సీన్స్‌ను తెరకెక్కించినప్పుడు టీమ్ పడిన శ్రమను చూస్తూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జక్కన్న తన టీమ్ పై ప్రత్యేకంగా స్పందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
డాక్యుమెంటరీ టీమ్‌లో పనిచేసిన ప్రదీప్ గురించి మాట్లాడిన రాజమౌళి, అతడిని 13 ఏళ్ల క్రితం ఫ్యాన్‌గా కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇప్పుడు అతడే డాక్యుమెంటరీపై అద్భుతంగా పని చేసినట్లు తెలిపారు.
డాక్యుమెంటరీకి శిరీష, వంశీ వంటి టాలెంటెడ్ ఎడిటర్లు ఉన్నారని, 20టీబీ డేటాలో సరైన ఫుటేజ్‌ను కనుగొనడం ఎంత కష్టమో వివరించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఈ డాక్యుమెంటరీ మరింత భావోద్వేగంగా ఉందని రాజమౌళి పేర్కొన్నారు. టీమ్ ప్రతిభకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
“మీ కష్టం ప్రతిభావంతంగా కనపడింది. ఈ స్ఫూర్తితో ముందుకు సాగండి” అంటూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
డాక్యుమెంటరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.