fbpx
Sunday, January 5, 2025
HomeMovie Newsసంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు..తాజా పరిణామాలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు..తాజా పరిణామాలు

SANDHYA-THEATER-STAMPEDE-CASE-LATEST-UPDATES
SANDHYA-THEATER-STAMPEDE-CASE-LATEST-UPDATES

హైదరాబాద్: హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నటి అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఆ తర్వాత బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా, నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

డిసెంబర్ 27న రిమాండ్ గడువు ముగియడంతో బన్నీ వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు.

అతని తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై నమోదైన సెక్షన్లు వర్తించవని లాయర్లు వాదించారు.

అంతేకాకుండా, బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే సమయంలో పోలీసులు ఈ వాదనకు కౌంటర్ ఇచ్చారు.

అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వకుండా విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.

ఒకవేళ బెయిల్ మంజూరు చేసినా, విచారణకు బన్నీ సహకరించాలని న్యాయస్థానం కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఇరు పక్షాల వాదనలు వినిపించిన తర్వాత తీర్పును జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసు తాజా పరిణామాలపై సినీ పరిశ్రమ, అభిమానులు, సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

మరోవైపు, బాధిత కుటుంబానికి పుష్ప-2 టీమ్ ఇప్పటికే రూ.2 కోట్ల పరిహారం అందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular