వర్జీనియా : తన తల్లితో కలిసి ఒక కొడుకు సరదాగా నిత్యావసరాల దుకాణానికి వెళ్లాడు. తల్లి సరుకులు కొనే పనిలో బిజీగా ఉండడంతో ఆ కొడుక్కి ఏం చేయాలో తోచలేదు. దీంతో అదే షాపులో ఒక స్క్రాచ్ కార్డు కనిపించగా, దాన్ని కొన్నాడు.
ఇంతలో తల్లి షాపింగ్ ముగించుకొని వచ్చింది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. తర్వాత తన వెంట తెచ్చకున్న స్క్రాచ్ కార్డును గీకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. స్క్రాచ్‌కార్డును గీకగానే అందులో ఉన్నది చూసి ఆనందంతో ఎగిరి గెంతేశాడు. వెంటనే తల్లి ఏమైందో అని పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందంటూ కొడుకును అడిగింది.
అమ్మ మనకు లాటరీలో 1.4కోట్ల రూపాయలు వచ్చాయని కొడుకు చెప్పాడు. అయితే కొడుకు చెప్పింది మొదట ఆ తల్లి నమ్మలేదు, స్క్రాచ్ కార్డును ఆమె చేతిలోకి తీసుకొని తనే స్వయంగా పరీక్షించింది. దాని మీద అక్షరాల 2,00,000 డాలర్లు గెలుచుకున్నట్లు ప్రింట్ చేసి ఉంది.
అంతే ఇక ఆ తల్లి కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. లాటరీ గెలుచుకున్న వ్యక్తి పేరు హెబర్ట్ స్క్రగ్స్. షాపింగ్ చేసినంత కాసేపు టైంలోనే కోట్లు సంపాదించిన కొడుకును చూసి తల్లి మురిసిపోతుంటే, మిగతా వారు మాత్రం వారికొచ్చిన బంపర్ లాటరీని చూసి ఈర్ష్య పడుతున్నారు.