మూవీడెస్క్: టాలీవుడ్ హీరో నాని (NATURAL STAR NANI), కోలీవుడ్ స్టార్ సూర్య మధ్య సమ్మర్ బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారుతోంది.
నాని హిట్ 3 మూవీని మే 1న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేయగా, సూర్య కూడా అదే రోజు రెట్రో (RETRO) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రెండు చిత్రాలూ పెద్ద అంచనాలు ఏర్పరచడం విశేషం.
హిట్ 3లో (HIT 3) నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండగా, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
నాని వరుస విజయాలతో జోరు మీద ఉండటంతో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక సూర్య రెట్రో ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడంతో మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించగలదని అంచనా.
గత చిత్రం కంగువా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, ఈసారి సూర్య పూర్తిగా ప్లాన్ చేసుకొని వస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ సినిమాకు బలంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ రెండు చిత్రాలు తమ సొంత మార్కెట్‌లో పైచేయి సాధించే అవకాశమున్నా, పాన్ సౌత్ లెవెల్‌లో విజయం ఎవరిదో చెప్పడం కష్టం.
టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్లతో వచ్చే హైప్ ఆధారంగా విజేత ఎవరో తేలనుంది.