మూవీడెస్క్: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నెగెటివ్ షేడ్స్ పాత్రలపై వెబ్ సిరీస్ హరికథ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే.
‘‘వాడెవడో ఎర్రచందనం దొంగ హీరో’’ అంటూ పుష్ప సినిమాపై కామెంట్ చేశారని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ పరిణామం రాజేంద్ర ప్రసాద్‌కు తీవ్ర ఇబ్బందిని కలిగించింది.
తన తాజా సినిమా షష్ఠిపూర్తి ఈవెంట్‌లో ఆయన దీనిపై స్పందించారు.
‘‘నేను పేకాట పాపారావు, అప్పుల అప్పారావు లాంటి పాత్రలు ప్రస్తావించి ట్రెండ్ మార్పుల గురించి మాట్లాడాను.
ఎవరినీ టార్గెట్ చేయలేదు, అని స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌ను ఇటీవల కలిసిన విషయాన్ని చెప్పిన ప్రసాద్, ఈ వివాదంపై నవ్వుకున్నామన్నారు.
ఈ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ పద్మ పురస్కారాల గురించి కూడా మాట్లాడారు.
నాకు పద్మశ్రీ రాకపోవడం గురించి నేను అసహనం చెందను.
రామోజీ రావుగారు ఒకసారి ఈ అవార్డులు మీ ప్రతిభకు సరిపోవని చెప్పినప్పుడు, అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశా, అని ఆయన పేర్కొన్నారు.