మూవీడెస్క్: మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపును సంపాదించిన అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం టాప్ సంగీత దర్శకుల్లో ఒకరు.
జైలర్, విక్రమ్, లియో, దేవర వంటి భారీ చిత్రాలకు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలకు ప్రధాన బలంగా నిలిచింది.
ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ 12, మేజిక్ వంటి సినిమాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, రవిచందర్ సంగీతంపై ఒక విమర్శ వినిపిస్తోంది.
థియేటర్లో అదరగొట్టినా, అతని పాటలకు లాంగ్ లైఫ్ ఉండడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో చెన్నైలో కాదలిక్క నేరమిల్లై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏఆర్ రెహ్మాన్ అనిరుధ్‌కి సలహా ఇచ్చాడు.
‘‘క్లాసికల్ టచ్ ఉన్న రాగాలతో పాటలు కంపోజ్ చేస్తే అవి శాశ్వతంగా నిలుస్తాయి’’ అని సూచించాడు.
రవిచందర్ టాలెంట్‌ని మెచ్చుకున్న రెహ్మాన్, లాంగ్ లాస్టింగ్ సంగీతంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇప్పుడు ప్రేమికుడు, రోజా, బొంబాయి పాటలు ఇప్పటికీ మక్కువగా వినిపిస్తుండటం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
రవిచందర్ రెహ్మాన్ సలహా పాటిస్తే, మరింత గొప్పతనాన్ని అందుకోగలడు. కాదలిక్క నేరమిల్లై చిత్రానికి రెహ్మానే సంగీతం అందించగా, ఇది పొంగల్ బరిలో దిగనుంది.