మూవీడెస్క్: పుష్ప 2తో పాన్ ఇండియా రేంజ్ లో టాప్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్, 1800 కోట్ల క్లబ్ లో చేరి, ఇప్పుడు 2000 కోట్లను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నాడు.
బాలీవుడ్ మార్కెట్ లోనూ బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇటువంటి సమయంలో బన్నీ, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబైలో కలవడం హాట్ టాపిక్ గా మారింది.
భన్సాలీ పీరియాడిక్ డ్రామాల స్పెషలిస్ట్ గా పేరుగాంచిన వ్యక్తి.
బన్నీతో భేటీ అనంతరం వీరిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
పుష్ప ఫ్రాంచైజ్ సక్సెస్ తర్వాత ఉత్తరాదిలోనూ బన్నీకి మంచి గుర్తింపు ఉంది.
ఇదే భవిష్యత్ ప్రాజెక్టులకు బలమైన పునాది అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ కొత్త సినిమా వేగంగా సెట్స్ పైకి రాబోతోంది.
అల వైకుంఠపురములో తర్వాత ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ ప్రాజెక్ట్ అనంతరం భన్సాలీ సినిమా ఖరారయ్యే అవకాశం ఉందని టాక్.
దీంతో పాటు బన్నీ, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో కూడా సినిమా ఉండబోతుందట.
అయితే భన్సాలీ, త్రివిక్రమ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్స్ అన్నీ బన్నీ మార్కెట్ రేంజ్ మరింత పెంచుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.