మూవీడెస్క్: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్ నెలకొంది.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది.
ప్రత్యేకంగా మెగా ఫ్యాన్స్ కోసం భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను నిర్వహించారు.
6000 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా విశేష స్పందన పొందుతోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, కియారా అద్వానీ గ్లామర్, ఎస్.జె.సూర్య విలనిజం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ భారీ కలెక్షన్లు సాధించింది. నెల్లూరు సిటీలో అయితే ప్రత్యేక రికార్డు సృష్టించింది.
అక్కడ ప్రీమియర్ షోలు, మల్టీప్లెక్స్ బుకింగ్స్ కలిపి ఏకంగా రూ.1.15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, ఆల్‌టైమ్ ఓపెనింగ్ రికార్డును నెలకొల్పింది.
సినిమాకు కలిసొచ్చే పాజిటివ్ అంశాల్లో చరణ్ అప్పన్న పాత్ర హైలైట్‌గా నిలిచింది. అభిమానులు అతని నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఫైటింగ్ సీన్స్, అంజలి ఎమోషనల్ ట్రాక్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే, కొన్ని సన్నివేశాలు మరింత బాగా ఉంటే సినిమా బలంగా అనిపించేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.