ఏపీ: ఫన్ బకెట్ వీడియోలతో గుర్తింపు పొందిన భార్గవ్ కి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లైంగిక వేధింపుల కేసులో అతనిపై నేరం నిరూపితమైంది. విశాఖకు చెందిన భాస్కర్ తన కామెడీ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అయితే, 2021లో తనతో నటించిన ఓ బాలికపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలతో అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
విచారణలో పోలీసులు కోర్టుకు పలు కీలక ఆధారాలు సమర్పించగా, అవి భార్గవ్ నేరానికి తార్కాణమయ్యాయి. ఈ మేరకు కోర్టు భాస్కర్‌ను దోషిగా తేల్చింది. అతనికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పుతో భార్గవ్ కెరీర్ ముగిసినట్టేనని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు. తన ప్రాచుర్యాన్ని తప్పు మార్గంలో వినియోగించి జీవితాన్ని నాశనం చేసుకున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.