న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎర్రకోట లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎర్రకోటపై ఏర్పాటు చేసిన మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. అనంతరం త్రివిధ ధళాల గౌరవ వందనం స్వీకరించారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ రక్షణ దళాలు నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులకు వందనం.
ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితిలో ఉంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు పనంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం. వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు అందరూ కృషి చేస్తున్నారు. కరోనా వారియర్స్‌కు శిరస్సు వంచి సలాం చేస్తున్నా. కరోనా ఒక్కటే కాదు, వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చాయి. కేంద్రం, రాష్ట్రాలు ఏకతాటిపై విపత్తులను ఎదుర్కొంటున్నాయి అంటూ మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు.
చైనా వస్తువులను నిషేధిద్దాం : (BAN IMPORT OF CHINESE PRODUCTS)
‘భారత్ చైనా వస్తువుల దిగుమతి పూర్తిగా నిషేధించాలి. ఇతర దేశాల వస్తువుల దిగుమతిని కూడా పూర్తిగా నిషేధించాలి. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అని నిరూపించాలి. ఒక నాడు భారత వస్తువులు అంటే ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ తిరిగి భారత దేసంలో తయారయ్యే వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం మనమంతా చేయాలి.
కరోనా కష్టకాలంలో కూడా మనం కొత్తదారులు వెతుక్కోవాళి. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. వోకల్ ఫర్ లోకల్ అనే మన నానుడీని నిలబెట్టుకుందాం. భారత్‌లో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఎఫ్‌డీఐల విషయంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు చేపట్టాం.’ అని పేర్కొన్నారు.
BAN IMPORT OF CHINESE PRODUCTS | BAN IMPORT OF CHINESE PRODUCTS