మూవీడెస్క్: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల వసూళ్లు సాధించిందని మేకర్స్ ప్రకటించారు.
అయితే ట్రేడ్ వర్గాల లెక్కలు చూస్తే ఈ మొత్తం 85 కోట్ల వరకే ఉంటుందని సమాచారం. ఈ డిఫరెన్స్ అభిమానుల్లో చర్చకు దారి తీసింది.
టాక్ పాజిటివ్ కాకపోయినప్పటికీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్‌ఫుల్ అయిన చోట్ల, వసూళ్లు మంచి స్థాయిలో ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నట్లు కనిపిస్తోంది. పుష్ప 2, RRR, బాహుబలి 2 వంటి చిత్రాలతో టాలీవుడ్ డామినేషన్ మళ్లీ స్పష్టమవుతోంది.
శంకర్ దర్శకత్వం, చరణ్ మాస్ ప్రెజెన్స్ సినిమాకు మంచి హైప్ తెచ్చాయి.
మేకర్స్ లెక్కలు నిజమైతే, ఈ చిత్రం తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కీలక స్థానంలో నిలుస్తుంది.
ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాలు మొదటి 7 స్థానాల్లో ఉన్నాయి.
KGF 2, లియో లాంటి పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాయి.
టాలీవుడ్ మార్కెట్ రేంజ్ మరోసారి తన హవాను నిరూపించింది.
మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు:
ఆదిపురుష్: 140 కోట్లు
పుష్ప 2: 294 కోట్లు
RRR: 223 కోట్లు
బాహుబలి 2: 210+ కోట్లు
కల్కి 2898 AD: 191.5 కోట్లు
గేమ్ ఛేంజర్: 186 కోట్లు
సలార్: 178.7 కోట్లు
దేవర: 172 కోట్లు
KGF 2: 160+ కోట్లు
లియో: 148.5 కోట్లు