ముంబై: చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియాకు చేదు వార్త ఎదురైంది. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయంతో లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
బీసీసీఐ బుమ్రాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పునరావాసం కోసం పంపింది. మార్చి మొదటి వారానికి అతడు అందుబాటులోకి రావచ్చని అంచనా.
భారత జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. లీగ్ దశలో బుమ్రా లేని లోటు భారత బౌలింగ్ దళంపై ప్రభావం చూపవచ్చు.
అయితే, మరోవైపు సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు. పిట్నెస్ సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న షమీ, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.
చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమవడం, షమీ రాకతో రెండు భిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుమ్రా లోటు భర్తీ చేయడంలో షమీ ఎంతవరకు సఫలమవుతాడనేది ఆసక్తికరంగా మారింది.