న్యూఢిల్లీ: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకున్న తరువాత చాలా కంపెనీలు ఆ అవకాశాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ పై ఆసక్తి చూపుతున్న టాటా గ్రూప్, రిలయన్స్ జియో, పతంజలి, ఎడు టెక్ ప్లాట్‌ఫాంలు బైజస్ మరియు అనాకాడమీలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ) సమర్పించడానికి శుక్రవారం గడువు ముగుసింది.
ఆసక్తి చూపిన వారందరూ ఆగస్టు 18 న బిడ్లను సమర్పించే అవకాశం లేదని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. టాటా గ్రూప్ తీవ్రమైన పోటీదారుగా ఉంది. పండుగ సీజన్లో ఐపిఎల్ షెడ్యూల్ ఉన్నప్పుడు మరియు స్పాన్సర్షిప్ కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు ఈ అరుదైన అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకోవచ్చు.
గత వారం ఐపీఎల్ స్పాన్సర్షిప్ ప్రకటించినప్పుడు ఈ సారి టైటిల్ ధరలో దాదాపు 30% నుండి 40% దాకా తగ్గింపు ఉండొచ్చు అని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. వివో చెల్లించిన రూ 440 కోట్ల ధరలో తగ్గింపు ఉండొచ్చని సమాచారం.
ఇతర స్పాన్సర్లతో పోలిస్తే, రిలయన్స్ జియో ఇప్పటికే చాల ఫ్రాంచైజీలతో కలిసి ఒక అడ్వర్టైజర్ గా అనుభవం కలిగి ఉంది. అదే విధంగా బైజూస్ కూడా ఇప్పటికే జెర్సీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. గత వారం కోల్ కత్తా స్పాన్సర్ గ విరమించుకున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో వివో అడుగు బయట పెట్టడానికి దారితీసిన చైనా వ్యతిరేక భావంతో, ఒక భారతీయ సంస్థ బిసిసిఐకి సరిగ్గా సరిపోతుంది అని అందరి భావన. ఇఓఐ ఆహ్వానంలోని ఒక నిబంధన కూడా బీసీసీఐ విస్తృత సమస్యలను పరిష్కరిస్తోందని సూచిస్తుంది.