ముంబై – విరుష్క: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ కొత్త ఇంటికి వలస వెళ్తున్నారు. అలీబాగ్‌లో నిర్మించిన విల్లా ఇప్పటికే పూలు, లైట్లతో అలంకరించబడి ప్రత్యేకంగా సిద్ధమైంది.
బుధవారం నాడు విరుష్క దంపతులు ముంబయి నుంచి అలీబాగ్‌కు వెళ్లారు..2022లో 19 కోట్ల రూపాయలతో స్థలం కొనుగోలు చేసిన ఈ జంట, మరో 13 కోట్ల రూపాయలతో సువిశాలమైన 10,000 చ.అ. ఇంటిని నిర్మించారు.
ఈ విల్లాలో ఉష్ణోగ్రత నియంత్రిత స్విమ్మింగ్ పూల్, నాలుగు బెడ్రూంలు, జాకుజీ, విశాలమైన గార్డెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
ఫిలిప్ ఫౌచే నేతృత్వంలో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లు ఈ ఇంటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కాలిఫోర్నియా కొంకణ్ తరహాలో తీర్చిదిద్దిన ఈ విల్లా, విరుష్క జంట కలలను సాకారం చేస్తోంది.
గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఈ కొత్త ఇంటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.