ఢిల్లీ: జాతీయ పార్టీ కాంగ్రెస్ ఢిల్లీలో అత్యాధునిక కొత్త కార్యాలయాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. ఇందిరాగాంధీ భవన్ పేరుతో నిర్మించిన ఈ కార్యాలయాన్ని బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు.
ప్రస్తుత అక్బర్ రోడ్డు కార్యాలయానికి బదులుగా కొత్త భవనంలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
అత్యాధునిక సదుపాయాలతో డిజైన్ చేసిన ఈ భవన నిర్మాణానికి దాదాపు ₹5,000 కోట్ల వరకు వ్యయం అయినట్టు సమాచారం.
నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలు, లక్ష కార్ల పార్కింగ్ సామర్థ్యంతో పాటు 250 కంటే ఎక్కువ వాష్‌రూమ్‌లు, 50 డైనింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అన్నీ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షుల కోసం ప్రత్యేక కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి.
వాస్తు ప్రామాణికతతో రూపొందించిన ఈ భవనాన్ని పటిష్ట నిర్మాణ పద్ధతులతో పూర్తి చేశారు. 15 ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణంలో ప్రపంచస్థాయి శ్రామికుల సహకారం పొందారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సహా పలువురు నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవనం ఆధునికత, రీతి రివాజులు అందరికీ ఆకర్షణగా నిలిచాయి.