తెలుగు చలన చిత్ర రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన కల్కి 2898 AD సీక్వెల్‌కి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్స్ బయటకు వచ్చాయి.
మొదటి భాగంతోనే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ సినీ ప్రేమికులను మంత్రముగ్దులను చేసింది. ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి బిగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు కల్కి 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అశ్విని దత్ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, కల్కి 2 కథ మూడు కీలక పాత్రల చుట్టూ తిరగనుంది. ప్రభాస్ పాత్రకు మళ్లీ సెంట్రల్ రోల్ ఉంటే, కమల్ హాసన్ కలి పాత్రకు ఈ సారి పూర్తి స్క్రీన్ టైమ్ ఇవ్వనున్నారు.
అమితాబ్ బచ్చన్ పాత్ర అశ్వత్థామ కూడా కీలకంగా ఉండబోతోందని అశ్విని దత్ తెలిపారు. ఇది కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుందని చెప్పడంలో సందేహం లేదు.
ఇప్పటికే కమల్ హాసన్ తన పాత్ర గురించి పలు సందర్భాల్లో మాట్లాడి, ఇది రెండో భాగంలో మరింత పర్‌ఫెక్ట్‌గా డెవలప్ అవుతుందని పేర్కొన్నారు.
దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం పెంచి, కథకు కొత్త లెవెల్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రాముఖ్యమైన పాత్రల చుట్టూ మాత్రమే కథ సాగుతుందని, కొత్త పాత్రల కోసం ఎక్కువ స్కోప్ లేదని అశ్విని దత్ స్పష్టం చేశారు. ఈ సారి కల్కి 2ను 2026లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.