మూవీడెస్క్: టాలీవుడ్లో సీతారామంతో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది.
రీసెంట్గా అడివి శేష్‌తో డెకాయిట్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె, మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతోంది.
ప్రస్తుతం మృణాల్ ప్రభాస్ లైన్లో ఉన్న ఓ సినిమాలో కూడా నటించనుందని రూమర్స్ వస్తున్నాయి.
తాజాగా, మృణాల్ అజయ్ దేవగణ్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
2012లో విడుదలైన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన మర్యాద రామన్న రీమేక్ కావడం విశేషం.
సీక్వెల్లో మృణాల్ ప్రధాన పాత్రలో నటిస్తుందని సమాచారం, ఇది ఆమె కెరీర్లో మరో కీలక మలుపు కానుంది.
ఈ సీక్వెల్లో కథను మరింత వినోదాత్మకంగా, కుటుంబ అనుబంధాలను హైలైట్ చేస్తూ రూపొందించనున్నారు.
అజయ్ దేవగణ్ తన గత పాత్రలో కనిపించనుండగా, మృణాల్ పాత్ర కథకు కొత్తదనాన్ని తెస్తుందని భావిస్తున్నారు.
2025 జూలై 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బాలీవుడ్లో ఇప్పటికే సూపర్ 30, జెర్సీ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన మృణాల్, ఇప్పుడు అజయ్ దేవగణ్‌తో కలసి నటించడంతో తన స్టార్‌డమ్‌ను మరింత స్థాయికి తీసుకెళ్లనుంది.
ఆమె నటన, పాత్ర ఎంపికలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.