fbpx
Monday, January 20, 2025
HomeMovie Newsహిందీ బాక్సాఫీస్‌పై పుష్ప 2 డామినేషన్: టాప్ 5లో నెంబర్ 1

హిందీ బాక్సాఫీస్‌పై పుష్ప 2 డామినేషన్: టాప్ 5లో నెంబర్ 1

PUSHPA-2-DOMINATES-HINDI-BOX-OFFICE-STANDS-TOP-1
PUSHPA-2-DOMINATES-HINDI-BOX-OFFICE-STANDS-TOP-1

మూవీడెస్క్: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 : ది రూల్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఈ సినిమా 1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను తిరగరాసింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అల్లు అర్జున్ నటన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

ప్రత్యేకంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమాకు వచ్చిన ఆదరణ అసాధారణం.

పుష్ప 2 హిందీ వెర్షన్‌ 4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేసి, టాప్ 5 హిందీ చిత్రాలలో నంబర్ 1 స్థానంలో నిలిచింది.

ఇది వరకే గదర్ 2 3.4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.

అయితే పుష్ప 2 ఆ రికార్డును దాటింది. అలాగే, షారుక్ ఖాన్ చిత్రాలు జవాన్ 3.1 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను, పఠాన్ 2.8 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేశాయి.

పుష్ప 2 విజయం, అల్లు అర్జున్‌కి ఉత్తరాదిలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.

హిందీ ఆడియెన్స్ ఈ సినిమాపై చూపించిన ప్రేమ, పుష్ప సిరీస్‌ను మరింత గ్లోబల్ రేంజ్‌లో నిలబెట్టింది.

మొదటి భాగం పుష్ప: ది రైస్ హిందీ బెల్ట్‌లో 1.31 కోట్ల ఫుట్‌ఫాల్స్ సాధించి రెండో పార్ట్‌కు పునాది వేసింది.

టాప్ 5 హిందీ ఫుట్‌ఫాల్స్ (పోస్టు పాండమిక్):

పుష్ప 2: ది రూల్ – 4 కోట్లు
గదర్ 2 – 3.4 కోట్లు
జవాన్ – 3.1 కోట్లు
పఠాన్ – 2.8 కోట్లు
స్ట్రీ 2 – 2.6 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular