మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను సృష్టించింది.
భారీ వసూళ్లతో పాన్ ఇండియా స్తాయిలో ఈ చిత్రం దూసుకుపోయింది.
ఈ విజయం తర్వాత బన్నీ తన నెక్స్ట్ మూవీ గురించి ఏం నిర్ణయం తీసుకున్నాడన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ తన నెక్స్ట్ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘జులాయి,’ ‘సన్నాఫ్ సత్యమూర్తి,’ ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.
ఈసారి కూడా ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈసారి వీడియో రూపంలో ఒక ప్రత్యేకమైన అనౌన్స్‌మెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరిలో అప్డేట్ ఉండవచ్చని సమాచారం. ఇది అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
త్రివిక్రమ్, బన్నీ మరోసారి కలిసేందుకు సన్నద్ధమవుతుండటంతో, ఈ కాంబినేషన్ కొత్త హైట్స్ కు చేరుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.