అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్‌లో పర్యటించాలనే ఆసక్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రముఖ ఇంగ్లీష్ మీడియా నివేదికల ప్రకారం, ట్రంప్ తన ప్రథమ విదేశీ పర్యటనలలో భాగంగా భారత్‌కు రానున్నారని తెలుస్తోంది.
ఇక చైనాతో వ్యాపార సంబంధాలు, దిగుమతులపై సుంకాలు వంటి విషయాలపై ట్రంప్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశారు. బీజింగ్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చైనాలో కూడా ఆయన పర్యటించే అవకాశం ఉందని సమాచారం.
చైనా, భారత్ పర్యటనలపై ట్రంప్ తన సలహాదారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, వైట్ హౌస్‌లో దేశాధినేతల సమావేశం నిర్వహించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం ట్రంప్ భారత పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ట్రంప్ భారత్ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.