మూవీడెస్క్: బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (BOBBY DEOL) తాజాగా తెలుగు తెరకు మరింత దగ్గరయ్యారు.
డాకు మహారాజ్ సినిమాలో ప్రతినాయకుడిగా తన విభిన్నమైన నటనతో మెప్పించిన బాబీ, ఇప్పుడు టాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్‌ను అందుకున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ (SPIRIT) సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా రూపొందుతోంది.
ఇందులో బాబీ డియోల్ సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
ఈ పాత్ర ఆయన కెరీర్‌లో మరో ప్రత్యేకమైన చాప్టర్‌గా నిలిచే అవకాశం ఉంది.
ఈ సారి బాబీ డియోల్ పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
స్పిరిట్ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇది సందీప్ రెడ్డి వంగా నుండి వస్తున్న మరో వినూత్నమైన కథాంశమని, సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా ఉంటుందని సమాచారం.
ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే ప్రత్యేకమైన పాటలను కంపోజ్ చేయడం మొదలుపెట్టారు.
ఈ చిత్రంలోని ప్రత్యేక సాంగ్ ఒకటి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందని చిత్ర బృందం విశ్వాసంతో ఉంది.