మూవీడెస్క్: నాగచైతన్య ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ తర్వాత ఆయన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక మిథికల్ మిస్టరీ థ్రిల్లర్ కోసం సిద్ధమవుతున్నారు.
విరూపాక్ష వంటి సూపర్ హిట్ అందించిన కార్తీక్ దండు ఈసారి మరింత ఆసక్తికరమైన కథను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో కథానాయికగా మొదట మీనాక్షి చౌదరిని అనుకున్నారు.
కానీ పారితోషిక సమస్యల కారణంగా ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోవాలని నిర్ణయించారు.
శ్రీలీల తాజా హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉండటమే కాకుండా, పాన్ ఇండియా ఆఫర్లను కూడా అందుకుంటున్నది.
అయితే, శ్రీలీల డేట్లు అఖిల్ ప్రాజెక్ట్‌తో క్లాష్ కావడంతో మళ్లీ మీనాక్షి వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈలోగా మీనాక్షి తన రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం, ఇది మేకర్స్‌కు మరింత చిక్కుగా మారింది.
సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ వంటి హిట్స్ ఆమె మార్కెట్ రేంజ్‌ను గట్టిగా పెంచాయి.
దీంతో, నిర్మాతలు ఇప్పుడు శ్రీలీల కోసం వేచి చూడాలా? లేక మీనాక్షికి అడిగినంత చెల్లించాలా? అనే దానిపై ఆలోచిస్తున్నారు.
సుకుమార్ ఈ చిత్రానికి మెంటర్‌గా ఉండటం, స్క్రిప్ట్ విషయంలో సహకరించడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు.