మూవీడెస్క్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం కన్నప్ప గురించి ప్రతి అప్డేట్కి సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
లేటెస్ట్ గా శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
శివుడి తాండవం చేస్తూ త్రిశూలం పట్టుకున్న అక్షయ్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కన్నప్ప ప్రాజెక్ట్ విష్ణు కెరీర్లో అతిపెద్ద చిత్రంగా నిలుస్తోంది.
మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో భాగమవుతుండటంతో, దీనికి పాన్ ఇండియా స్థాయి హావభావం వచ్చింది.
అందులో ప్రభాస్ ప్రత్యేకంగా నంది దేవుడి పాత్రలో 20 నిమిషాలపాటు కనిపించనున్నారని సమాచారం.
ఇటీవల కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా వచ్చిన పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు అక్షయ్ లుక్ సినిమాపై క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది.
టీజర్ విడుదల తర్వాత, ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం మార్పులు చేయడంతో, సినిమా పట్ల ఆసక్తి మరింతగా పెరిగింది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న కన్నప్ప బృందం, ఈ సమ్మర్లో ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నప్ప కథను కొత్తగా చెప్పబోతోందని టాక్. మరి ఈ అంచనాలను ఈ చిత్రం ఎలా అందుకుంటుందో వేచి చూడాలి.