ముంబై: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఓ అరుదైన రికార్డు సాధించే అవకాశంలో ఉన్నాడు.
ఇప్పటివరకు 60 టీ20 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు తీసిన అర్ష్‌దీప్, మరో రెండు వికెట్లు సాధిస్తే భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు.
ప్రస్తుత రికార్డు యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు) పేరిట ఉంది. అంతేకాదు, ఈ సిరీస్‌లో 100 వికెట్లు పూర్తి చేసి, టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచే అవకాశం కూడా అర్ష్‌దీప్‌కు ఉంది.
అర్ష్‌దీప్‌తో పాటు హార్దిక్ పాండ్యా (89 వికెట్లు) కూడా 100 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇరువురు బౌలర్లు రాణిస్తే, టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో అరుదైన చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్, భువనేశ్వర్ కుమార్ (90 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (89 వికెట్లు) అగ్రస్థానాల్లో ఉన్నారు. అయితే 100 వికెట్ల మైలురాయిని చేరిన బౌలర్ లేకపోవడం గమనార్హం. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అర్ష్‌దీప్, హార్దిక్ బౌలింగ్‌లో మెరిసి భారత బౌలింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం రాయాలనుకుంటున్నారు.