అంతర్జాతీయం: 100 ఏళ్ల చరిత్రకు ముగింపు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దు: ట్రంప్ సంచలన ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రభుత్వం దశాబ్దాలుగా అమలులో ఉన్న జన్మతః పౌరసత్వ విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేసింది.
అమెరికాలో జన్మించిన పిల్లలు స్వతహాగా పౌరసత్వ హక్కు పొందే 14వ రాజ్యాంగ సవరణను ట్రంప్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. అక్రమ వలసదారులు, టూరిస్టు, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇకపై పౌరసత్వ హక్కులు ఉండబోవని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం అమెరికాలో వలస విధానంపై కఠినంగా వ్యవహరించేందుకు తమ కట్టుబాటుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, ఈ విధానాన్ని రద్దు చేయడం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
100 ఏళ్ల చరిత్రకు ముగింపు
జన్మతః పౌరసత్వం అంటే వలసదారుల పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించేందుకు 1868లో 14వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. ఈ విధానం దాదాపు 100 ఏళ్లుగా కొనసాగుతోంది. అంతర్యుద్ధం తర్వాత అమలులోకి వచ్చిన ఈ చట్టం శరణార్థుల పిల్లలకు రక్షణ కల్పించింది.
ట్రంప్ తప్పు వ్యాఖ్యలు
ట్రంప్ ఈ విధానంపై వ్యాఖ్యానిస్తూ, ‘‘అమెరికా మాత్రమే ఇలాంటి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది’’ అని అన్నారు. కానీ, వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఇలాంటి చట్టాలను అనుసరిస్తున్నాయని నిపుణులు వివరించారు.
న్యాయసవాళ్లకు దారితీసే నిర్ణయం
ఈ కొత్త ఆర్డర్ అమలు విషయంలో అనేక న్యాయసవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ కీలకమైనదిగా పరిగణించబడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
వలస విధానంపై ప్రభావం
ఈ ఆదేశాలు ట్రంప్ పాలనలో వలసదారుల పట్ల కఠిన వైఖరికి సంకేతంగా నిలుస్తున్నాయి. అక్రమ వలసలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసిందని ట్రంప్ స్పష్టం చేశారు.