టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ 2019 సంవత్సరంలో ‘నిను వీడని నీడను నేను’ సినిమాతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. ఆ సినిమా తో ప్రొడ్యూసర్ గా గొప్ప విజయాన్ని అయితే అందుకోలేదు గాని నష్టాల్ని ఐతే చవి చూడలేదు. ఆ తర్వాత హాకీ బ్యాక్ డ్రాప్ లో ‘ఏ 1 ఎక్స్ ప్రెస్’ అనే సినిమాని నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఇపుడు తన మూడవ ప్రొడక్షన్ గా ‘వివాహ భోజనంబు’ అనే సినిమాని ప్రకటించాడు ఈ హీరో. మొదటి సారి తాను కాకుండా వేరే హీరో తో ప్రొడ్యూసర్ గా సినిమా తియ్యబోతున్నాడు సందీప్. విశేషమేమిటంటే సందీప్ కిషన్ నడిపిస్తున్న ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ పేరునే సినిమా పేరుగా పెట్టాడు.
అయితే ఇంతముందే సందీప్ కిషన్ ‘సోమవారం ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇయ్యబోతున్నా’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. అందరూ పెళ్లి గురించి అప్డేట్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటిది ఏమి లేదు కొత్త సినిమా ప్రకటిస్తున్నా అని చెప్పాడు. తాను పెట్టిన పోస్ట్ కి పెళ్లి అప్డేట్ ఏమో అనుకోని చాల ఫోన్ కాల్స్ మెసేజెస్ వచ్చాయని చెప్పాడు. రామ్ అబ్బరాజు రూపొందిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఒక పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని హీరో గా పరిచయం చేయబోతున్నాం అని చెప్పాడు కానీ హీరో ఎవరు అనేది మీరే ఊహించి చెప్పండి అని అభిమానులకే పజిల్ విసిరాడు. ఈ సినిమాకి ‘జెమిని కిరణ్’ సమర్పణలో వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే పెళ్లి తో షాక్ ఇస్తాడనుకున్న సందీప్ ఇలా సినిమా అనౌన్స్ చెయ్యడానికి ఇంత హంగామా చెయ్యాలా అని ట్రోల్ చేస్తున్నారు. కానీ అలాంటి అనౌన్స్మెంట్ తో సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ వచ్చిందని మేకర్స్ ఆలోచన అయి ఉంటుంది.