ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం నారా చంద్రబాబునాయుడు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటున్నారు. గడచిన నాలుగు రోజులుగా చంద్రబాబు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిపి ఏపీలో పెట్టుబడులకు అవకాశాలను వివరించారు.
తెల్లవారు జామున ప్రారంభమయ్యే ఈ సమావేశాలు రాత్రి వరకు కొనసాగుతుండటంతో చంద్రబాబు పర్యటన తీరిక లేకుండా సాగుతోంది.
ఇక అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నందున పాలనా వ్యవహారాలను పవన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలోనే ఉండి రోజువారీ కార్యక్రమాలను నియంత్రిస్తున్నారు. చంద్రబాబు లేని లోటును ప్రజలకు గమనించనీయకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గురువారం సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, వైష్ణవి వాసుదేవన్ అమరావతికి వచ్చి పవన్ కల్యాణ్‌ను కలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఏపీతో సింగపూర్ సంబంధాలను మరింత బలపరచాలని చర్చించారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ పాత్ర కీలకమని, భవిష్యత్తులో సహకారం మరింతగా అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
చంద్రబాబు విదేశీ పర్యటన సాగుతుండగా, పవన్ సర్కారు పనులను సమర్థంగా నిర్వహించడంపై ప్రశంసలు వినిపిస్తున్నాయి.