మాలీవుడ్: మళయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అక్కడ స్టార్ హీరో. ఆయన చివరగా తీసిన సినిమా ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’ సినిమా మంచి పేరుతో పాటు మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ఈ సినిమాని వివిధ భాషల్లో రీమేక్ చెయ్యడానికి ప్రొడ్యూసర్స్ రైట్స్ కోసం ఎగబడుతున్నారు. ఈ హీరో మొన్న కరోనా సమయం లో చాలా రోజులు ‘ఆడుజీవితం’ సినిమా షూటింగ్ కి అని వెళ్లి ‘జోర్డాన్’ లో ఇరుక్కున్నారు. దాదాపు సినిమా టీం అంతా ఒక నలభై రోజులు అక్కడే ఉన్నారు. అయితే ఆ సమయం లో పెర్మిషన్స్ తీసుకుని ఆ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ భారత దేశపు మొదటి వర్చ్యువల్ చిత్రంలో నటించనున్నట్టు ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాపై ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. ఫిలిం మేకింగ్ లో ఇదొక కొత్త కళ, అలాగే ఇందులో వాడే టెక్నాలజీ ఎక్సయిటింగ్ గా ఉంటుందని చెప్పాడు. కాలం మారే కొద్దీ కొత్త కొత్త సవాళ్లు, కొత్త ఆవిష్కరణలు వాటితో ఒక అద్భుతమైన కథని చెప్పబోతున్నాం అని ట్వీట్ చేసారు. ఈ ప్రాజెక్టును గోకుల్ రాజ్ బాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో రూపొందించి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.