మూవీడెస్క్: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన తండేల్ (THANDEL) సినిమా సంగీతంతోనే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా, ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
కానీ, ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు భారీ హైప్ తెచ్చాయి.
లవ్ స్టోరీ తర్వాత చైతూ, సాయి పల్లవి జంటగా వస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
తండేల్ మొదటి పాట “బుజ్జి తల్లి” యూట్యూబ్‌లో 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అందరినీ మైమరిపించింది.
క్లాసిక్ మ్యూజిక్‌తో పాటు చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
రెండో పాట “నమో నమః శివాయ” భక్తిరసభరితంగా, శివుడిపై ఉన్న పాటలలో మరో రత్నంగా నిలిచింది.
8 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్‌ను మరోసారి చూపించింది.
తాజాగా విడుదలైన మూడో పాట “హైలెస్సా హైలెస్సా” మెలోడీ సంగీతంతో పాటుగా, పాటలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్‌ను అందుకోవడం విశేషం. ఈ పాటల విజయాలతో తండేల్‌పై మరింత అంచనాలు పెరిగాయి.