fbpx
Thursday, January 30, 2025
HomeNationalడొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారు?

డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారు?

modi-trump-phone-conversation

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీతో తొలిసారి ఫోన్ ద్వారా మాట్లాడారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ ఫోన్ సంభాషణ జరగడం గమనార్హం. ఇరువురు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించినప్పుడు మోదీ ఇప్పటికే ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ సంభాషణ వారి భాగస్వామ్యానికి కొత్త దిశను చూపిందని భావిస్తున్నారు.

ప్రత్యేకంగా అమెరికా పౌరసత్వ చట్టాల మార్పుల అంశంపై భారత ప్రధాని తన అభిప్రాయాలను ట్రంప్‌కు వెల్లడించినట్లు సమాచారం.

ఈ ఫోన్ సంభాషణ అనంతరం మోదీ ఎక్స్ వేదికగా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ప్రపంచ శాంతి, భద్రత, శ్రేయస్సు కోసం ఇరుదేశాలు కలిసి పని చేస్తాయని వెల్లడించారు. తన ప్రియమిత్రుడితో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని మోదీ అన్నారు.

ఇటీవల అమెరికా పౌరసత్వ చట్టాల మార్పులు అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంలో ఇరు దేశాల నాయకుల ఫోన్ సంభాషణ ప్రాధాన్యతను సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular