fbpx
Thursday, January 30, 2025
HomeNationalఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

Implementation of Uniform Civil Code in Uttarakhand

జాతీయం: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలులో ఉత్తరాఖండ్ రాష్ట్రం కీలక మైలురాయిగా నిలిచింది. సోమవారం నుంచి ఈ చట్టం అధికారికంగా అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి యూసీసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను ఆవిష్కరించారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు కల్పించడమే లక్ష్యంగా ఈ చట్టం తీసుకొచ్చామని ధామి స్పష్టం చేశారు. ఈ చట్టం మహిళా సాధికారతకు దోహదం చేస్తుందని, బాల్య వివాహాలు, ముమ్మారు తలాక్, బహుభార్యత్వం వంటి అనుచిత ప్రవర్తనలను పూర్తిగా అరికట్టడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు.

యూసీసీ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న షెడ్యూల్డ్ తెగలను మినహాయిస్తుందని సీఎం ధామి వెల్లడించారు. ఈ కొత్త పోర్టల్ ద్వారా వివాహాలు, విడాకులు, సహజీవనాల వంటి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరైంది. ముఖ్యమంత్రిగా మొదటగా ధామి తన వివాహాన్ని నమోదు చేసి ధ్రువపత్రాన్ని స్వీకరించారు.

యూసీసీపై ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు

ఉమ్మడి పౌరస్మృతిపై కొందరు అజ్ఞానంతోనే వ్యతిరేకిస్తున్నారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం దేశ పౌరుల భద్రత కోసం సమాన విధివిధానాలు అమలు చేయడం ప్రభుత్వ హక్కు అని ఆయన వివరించారు. త్వరలోనే యూసీసీ దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందని ధన్‌ఖడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌ అభ్యర్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular