మూవీడెస్క్: విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యూఎస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది.
ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదంతో కూడిన ఈ సినిమా పండుగ సీజన్‌కి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
తాజాగా ఈ చిత్రంపై దర్శకుడు అనీల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“సంక్రాంతికి వస్తున్నాం” హిందీలో రీమేక్ చేస్తే చాలా బాగా క్లిక్ అవుతుందని అనీల్ అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, ఈ చిత్రంలో వెంకటేష్ పాత్రకు సల్మాన్ ఖాన్ పూర్తిగా సరిపోతారని, ఆయనతో ఈ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమని తెలిపారు.
తెలుగు వెర్షన్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, హిందీ ఆడియెన్స్‌కు కూడా ఈ కథ నచ్చుతుందని అనీల్ భావిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ మాస్ అప్పీల్ ఈ సినిమాకు అదనపు బలంగా నిలుస్తుందని, బాలీవుడ్ మార్కెట్లో ఇది మంచి విజయాన్ని సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రీమేక్ విషయంలో చిత్ర నిర్మాతలు త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని అనీల్ తెలిపారు.
తెలుగులో సంక్రాంతి సినిమాల హవా ఇప్పటికీ కొనసాగుతుండగా, “సంక్రాంతికి వస్తున్నాం” హిందీలో రీమేక్ అయితే, అది మరింత పెద్ద మార్కెట్లో అద్భుత విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా తెరపైకి వస్తే, సల్మాన్ ఖాన్‌తో ఈ కథ మరింత గ్లోరిఫై అవుతుందేమో చూడాలి.