fbpx
Thursday, January 30, 2025
HomeNationalకేజ్రీవాల్ వ్యూహాలపై బీజేపీకి పరీక్ష

కేజ్రీవాల్ వ్యూహాలపై బీజేపీకి పరీక్ష

kejriwal-strategy-vs-bjp-delhi-election

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు ఈసారి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మోదీ నాయకత్వంలోని బీజేపీ దేశవ్యాప్తంగా పటిష్ఠంగా నిలుస్తున్నా, ఢిల్లీ అసెంబ్లీలో వరుస పరాజయాలతో బీజేపీ దశాబ్దకాలంగా నిరుత్సాహానికి గురవుతోంది.

కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీ బీజేపీకి గట్టిపోటీగా నిలుస్తూ మూడోసారి అధికారాన్ని నిలుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం కేజ్రీవాల్ మరింత దూకుడుగా తన వ్యూహాలను అమలు చేస్తూ బీజేపీకి ప్రతి అడుగులోనూ సవాల్ విసురుతున్నారు.

2014 నుంచి కేజ్రీవాల్ అనుసరిస్తున్న వ్యూహాలను డీకోడ్ చేయలేకపోవడం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. అవినీతి ఆరోపణలు, దశాబ్దకాల ప్రభుత్వ వ్యతిరేకత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ తన ప్రజాదరణను తగ్గకుండా కొనసాగించడంలో విజయం సాధించారు.

ఈసారి కూడా బీజేపీకి ఢిల్లీ ఎన్నికలలో విజయాన్ని సాధించడం కీలకమైంది. ఎన్నికల ఫలితాలు మోదీ ప్రతిష్ఠను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కమలనాథులు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు.

మరోవైపు, కేజ్రీవాల్ కూడా తన రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నారు. గెలుపు ఎవరి వైపుకు మొగ్గుతుందో తెలుసుకోవాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular