ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఫిబ్రవరి 2న ఆయన ఢిల్లీలోని తెలుగు వారితో సమావేశమై టీడీపీ అభ్యర్థులకు మద్దతు తెలియజేయనున్నారు.
ఢిల్లీ తెలుగు అసోసియేషన్ చంద్రబాబును ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి, ప్రచారానికి సిద్ధమయ్యారు.
ఇవాళ ఎంపీలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయాలని ఎంపీలకు సూచించారు.
ఈ ఎన్నికల ద్వారా పార్టీకి ప్రాధాన్యత పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగువారికి చెందిన సమస్యలను పరిష్కరించడంలో తమ పాత్రను గుర్తుచేస్తూ టీడీపీ మద్దతు కోరాలని తెలిపారు.
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుండగా, చంద్రబాబు ప్రచారం తెలుగు ఓటర్లపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.