అమెరికా: మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు కుట్ర జరిగినట్లు రాజకీయ విశ్లేషకుడు, ఫాక్స్ న్యూస్ మాజీ యాంకర్ టకర్ కార్ల్ సన్ సంచలన ఆరోపణలు చేశారు.
బైడెన్ ప్రభుత్వం పుతిన్‌ను మట్టుబెట్టేందుకు యత్నించిందని, ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ మాట్ తైబీతో నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కార్ల్ సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచాన్ని యుద్ధం వైపు నడిపించే కుట్రలకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ ప్రధానంగా కారణమని ఆరోపించారు.
అయితే, తన వ్యాఖ్యలకు నమ్మదగిన ఆధారాలు లేవని ఆయన అంగీకరించినప్పటికీ, ఈ ఆరోపణలు అమెరికా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉంటే, రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ ఆరోపణలపై స్పందించారు. పుతిన్‌కు రష్యన్ స్పెషల్ సర్వీస్ విస్తృత భద్రతను ఏర్పాటు చేసిందని, ఈ భద్రతా వ్యవస్థ ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.