fbpx
Monday, February 3, 2025
HomeMovie Newsదిల్ రాజు : బిగ్ ప్రాజెక్ట్‌లపై దూకుడు!

దిల్ రాజు : బిగ్ ప్రాజెక్ట్‌లపై దూకుడు!

DIL-RAJU-GEARS-UP-FOR-BIG-BUDGET-MOVIES
DIL-RAJU-GEARS-UP-FOR-BIG-BUDGET-MOVIES

మూవీడెస్క్: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, గేమ్ ఛేంజర్ ఫలితంతో భారీ నష్టాన్ని చవిచూశారు.

అయితే, సంక్రాంతికి వస్తున్నాం విజయంతో కొంత మేరకు ఆ నష్టాన్ని తగ్గించుకున్నారు.

శంకర్ ప్రాజెక్ట్ వల్ల పెద్ద బడ్జెట్ సినిమాల పట్ల ఆయన రిస్క్ తీసుకోరనే ప్రచారం జరిగినా, తాజాగా ఆయన పెద్ద దర్శకులతో మళ్లీ ప్రాజెక్ట్‌లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతుండటంతో, రాజు ప్రొడక్షన్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు.

దీంతో, తన బ్యానర్‌లో క్రేజీ ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ భారీ సినిమా చేయాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2 ఎన్టీఆర్ 31 సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, 2027లో ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయని టాక్.

ఈ ప్రాజెక్ట్ కోసం భారీ స్టార్ హీరోను రాజు లైనప్ చేసే అవకాశం ఉంది. మరి ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular