మూవీడెస్క్: 2025 మొదటి నెల ముగిసింది. ఎప్పటిలానే సంక్రాంతి సీజన్లో భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి.
జనవరి మొదటివారంలో చిన్న సినిమాలు రిలీజయ్యాయి కానీ, పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత పుష్ప-2 మేనియా కొనసాగింది.
చివరికి సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య విడుదలైంది.
కానీ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో మేకర్స్‌కు భారీ నష్టాలనే మిగిల్చింది.
బాలకృష్ణ డాకు మహారాజ్ మాత్రం హిట్ టాక్ అందుకుంది. బాబీ డైరెక్షన్, ప్రెజెంటేషన్ సినిమాకు ప్లస్ అయ్యాయి.
వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మాత్రం అన్ని చోట్లా సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ సంవత్సరం సంక్రాంతి బాక్సాఫీస్ గతేడాది జనవరి సీన్‌ను రిపీట్ చేసింది.
2024లో గుంటూరు కారం అంచనాలను అందుకోలేకపోయినట్లే, ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఫలితం కూడా అలాగే మారింది.
అయితే 2024లో హనుమాన్ ఎలా సర్ప్రైజ్ హిట్ అయ్యిందో, ఈసారి సంక్రాంతికి వస్తున్నాం అదే రేంజ్లో హిట్‌గా నిలిచింది.
2024 జనవరి ఫార్ములా 2025లోనూ రిపీట్ అయ్యిందని చెప్పొచ్చు.