మూవీడెస్క్: యంగ్ హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన తండేల్ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుకుంటూ వస్తోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది.
సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో, రొమాంటిక్ ఎమోషన్‌కు ఎక్కువ స్కోప్ ఉందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది.
ట్రైలర్‌లో సముద్రం బ్యాక్‌డ్రాప్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తండేల్ కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డారని డైరెక్టర్ చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
“సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకోవడం సరే, కానీ రోజూ సముద్రంలోకి వెళ్లడం, వరుసగా రక్తం వాంతులు చేసుకున్నా ప్రయత్నం చేయడం నిజంగా నమ్మశక్యం కాదు.
అలాంటి కష్టానికి ఎవరూ సిద్ధం కారు” అంటూ చైతూకి బిగ్ సల్యూట్ ఇచ్చారు.
సాధారణంగా హీరోలు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం జిమ్‌లో శ్రమిస్తారు, కానీ ఈ సినిమాకు చైతూ ఏకంగా సముద్రంలో రోజువారీ కష్టాన్ని అనుభవించారు.
“ఎండలో, నీటిలో గంటల కొద్దీ ఉండి షూటింగ్ చేయడం అంత సులభం కాదు.
కానీ చైతూ ఎలాంటి వెనుకడుగు వేయకుండా పనిచేశాడు” అని చందూ చెప్పారు.
ఇంత కష్టం చేసి నటించిన చైతూ, ఈ సినిమాతో మరోసారి తన అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ను చూపించబోతున్నాడు.
బుజ్జి తల్లి – రాజు ప్రేమకథ ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో, చైతూ నటన సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో ఫిబ్రవరి 7న థియేటర్లలో చూడాల్సిందే!