జాతీయం: ఆదాయ పన్నుపై వచ్చే వారం బిల్లు – కొత్త మార్పులు ఇవే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను విధానంలో మార్పులు తీసుకురావడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం పార్లమెంట్‌లో కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆమె ప్రకటించారు.
ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలు
“ముందు విశ్వాసం – తర్వాతే పరిశీలన” అనే దిశగా పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేయడమే ఈ బిల్లు లక్ష్యం అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల్లో సగం తగ్గింపు, టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) సవరించి మరింత సరళంగా మార్చేలా ఈ బిల్లును రూపొందించామని తెలిపారు.
వృద్ధులకు ఆదాయం పెంపు – TDS పరిమితి పెరుగుదల
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఉపశమనం కల్పిస్తూ వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.50,000 నుంచి రూ.1,00,000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక అద్దె ద్వారా వచ్చే ఆదాయానికి టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు.
ఐటీ రిటర్నుల సమర్పణ గడువు పెంపు
ప్రస్తుతం ఏదైనా మదింపు సంవత్సరానికి అప్‌డేటెడ్ ఐటీ రిటర్నులను సమర్పించేందుకు ఉన్న గడువు రెండేళ్లుగా ఉండగా, దాన్ని నాలుగేళ్లకు పెంచారు. దీని ద్వారా పన్ను చెల్లింపుదారులకు మరింత వడివడిగా సవరించే అవకాశం కల్పించనున్నారు.
ఉన్నత విద్య రుణాలకు ఊరట
విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు టీసీఎస్ మినహాయింపు ఇచ్చేలా ఈ బడ్జెట్‌లో ప్రస్తావించారని నిర్మలా సీతారామన్ తెలిపారు.
కొత్త మార్పుల ప్రభావం
ఈ మార్పులు అమలులోకి వస్తే, పన్ను చెల్లింపుదారులపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మధ్య తరగతి, వృద్ధులకు ఈ మార్పులు పెద్ద ఊరట కలిగించే అవకాశముంది. బిల్లు పాస్ అయిన తర్వాత, ఈ పన్ను విధాన మార్పులు ఎప్పటి నుంచి అమలవుతాయనేదానిపై స్పష్టత రానుంది.