మూవీడెస్క్: పుష్ప 2 ప్రమోషన్! సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి.
కానీ కొన్ని పాత ట్రెండ్స్ మళ్లీ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే సందర్భాలు కూడా లేకపోలేదు.
ఇప్పుడు అలాంటి ప్రయోగమే పుష్ప 2: ది రూల్ మేకర్స్ చేశారు. విడుదలైన రెండునెలలు అయినా, ఈ సినిమా హవా తగ్గలేదు.
ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన తర్వాత కూడా మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్ ప్లాన్ చేశారు.
ఇప్పటివరకు సాంగ్స్ జ్యూక్ బాక్స్ లను రిలీజ్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు డైలాగ్ జ్యూక్ బాక్స్‌ను విడుదల చేసి ఒక కొత్త ట్రెండ్‌ను తెచ్చారు.
90లలో, 2000ల ప్రారంభంలో డైలాగ్ క్యాసెట్లు విపరీతంగా హిట్ అయిన సంగతి తెలిసిందే.
అప్పట్లో రిపీట్ మోడ్‌లో సినిమాలు చూడలేకపోయేవారు. దీంతో సూపర్ హిట్ సినిమాల సంభాషణలు క్యాసెట్లు తీసుకెళ్లి వినేవారు.
అదే తరహాలో ఇప్పుడు పుష్ప-2 నుండి కొన్ని ముఖ్యమైన డైలాగ్స్‌ను రిలీజ్ చేశారు.
ముఖ్యంగా పుష్పరాజ్ సీఎం అవ్వాలని రావు రమేష్ చెప్పే సీన్, శ్రీవల్లి ఎమోషనల్ డైలాగ్, ఎర్రచందనం డీల్ వంటి క్రేజీ డైలాగ్స్ ఈ జ్యూక్ బాక్స్‌లో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ఐడియా ఫుల్ వైరల్ అవుతోంది. మరి ఈ ట్రెండ్‌ను మరో చిత్రయూనిట్ ఫాలో అవుతుందా? అన్నదే ఆసక్తికరంగా మారింది.