తెలంగాణ: కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందిస్తూ, ఈ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టలేనని, సరైన సమయంలో వివరణ ఇస్తానని తెలిపారు.
పార్టీలో అంతర్గత అంశాలపై రాహుల్ గాంధీ సూచించిన విధంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఎక్కువ స్వేచ్ఛ ఉందని, ముఖ్యమంత్రి అత్యవసరంగా అయితేనే జోక్యం చేసుకుంటారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ హయాంలో నియంత్రిత పరిపాలన ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా లేదని అన్నారు. మంత్రులకు స్వేచ్ఛను ఇవ్వాలన్న ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏ ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉండటం సహజమని, కానీ ప్రభుత్వం బద్నాం కాకుండా చూసుకోవాలని సూచించారు. తనకు పార్టీ వ్యహారాల్లో అధికార పరిధి లేదని, కానీ పార్టీ పరంగా మాత్రమే పని చేస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధినాయకత్వం ఓడిపోయిన వారికి కూడా ప్రాధాన్యత కల్పించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ నిర్ణయాలు కీలకంగా మారనున్నాయన్నారు.